వైద్యులకు వందనాలు
- డాక్టర్స్ డే సందర్భంగా గవర్నర్ శుభాకాంక్షలు

హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): కరోనా సంక్షోభ సమయంలో మృత్యువును సైతం ఎదిరించి ప్రజల ప్రాణాలను కాపాడిన వైద్యులకు వందనాలు తెలియజేస్తున్నానని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య వృత్తిలో ఉన్న వారికి గవర్నర్ అభినందనలు తెలిపారు. భారతీయ సమాజం వైద్యులను దైవంతో సమానంగా చూస్తున్నదన్నారు. మానవాళి మనుగడకు సవాల్ విసురుతున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులు అందరికంటే ముందున్నారని, కొవిడ్ రోగులను రక్షించేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టారని గుర్తుచేశారు. వారి కరుణ, మానవత్వం ఎనలేనిదని గవర్నర్ పేర్కొన్నారు. దివంగత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, వైద్యులు డాక్టర్ బిదన్ చంద్రరాయ్ వర్ధంతి సందర్భంగా ఏటా జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

