NDRF | ఎన్డీఆర్ఎఫ్ ట్విట్టర్ ఖాతా హ్యాక్
NDRF Twitter Handle | నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ను శనివారం అర్ధరాత్రి హ్యాకింగ్‌కు గురైంది. సాంకేతిక నిపుణులు ఖాతాను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎన్డీఆర్ఎఫ్

న్యూఢిల్లీ : నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ శనివారం అర్ధరాత్రి హ్యాకింగ్‌కు గురైంది. సాంకేతిక నిపుణులు ఖాతాను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఆదివారం తెలిపారు. ఇటీవల వరుసగా భారత్‌లో ట్విట్టర్ ఖాతాలు హ్యాకింగ్ బారినపడుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికే పలువురు ప్రముఖల ఖాతాల్ హ్యాకింగ్‌కు గురయ్యారు. ఈ నెల 12న కేంద్ర సమాచార, ప్రసార శాఖ అధికార ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ చేసిన హ్యాకర్లు ‘ఎలాన్ మస్క్’గా మార్చడంతో పాటు 50కిపైగా వరుస ట్వీట్లు చేశారు.
హరీ అప్ (Hurry Up) , అమేజింగ్ (Amazing) అంటూ రాసి వాటి కింద టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఫొటోతో హైపర్ లింక్‌లు పోస్ట్ చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఖాతాను పునరుద్ధరించి ఆ ట్వీట్లను డిలీట్ చేశారు. డిసెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాకర్ల బారినపడ్డ విషయం తెలిసిందే. హ్యాకర్లు భారతదేశం ‘బిట్ కాయిన్‌ను అధికారికంగా చట్టబద్ధమైన బిడ్‌గా స్వీకరించింది‘ అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత అధికారులు వెంటనే ఖాతాను పునరుద్ధరించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్ (ICWA), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA), మన్ దేశి మహిళా బ్యాంక్ ట్విట్టర్ ఖాతాలూ హ్యాకింగ్ బారినపడ్డాయి.
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
- Tags
- Hacked
- NDRF
- Twitter handle
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

