ప్రపంచ అటవీ దినోత్సవం : శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో అడవుల పునరుద్ధరణ, సంరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణకు హరితహారం కింద అద్భుత ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా హరితయజ్ఞంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.
అడవుల పరిరక్షణ ఆవశ్యకత అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో, జనంలో చైతన్యం రావాలని మార్చి 21ని ప్రపంచ అటవీ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. తొలిసారిగా 2014న విశ్వవ్యాప్తంగా అటవీ దినోత్సవం పాటించారు. మానవుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధికి అడవులు ఎంతో అవసరమని తెలుపడమే ప్రపంచ అటవీ దినోత్సవ ముఖ్య ఉద్దేశం.
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

