KIMS | కిమ్స్‌లో అరుదైన శస్త్రచికిత్స.. తొమ్మిదేండ్ల బాలికకు కొత్త జీవితమిచ్చిన వైద్యులు
KIMS | పుట్టుకతోనే విపరీతమైన గూనితోపాటు వెన్నెముకపై అసాధారణమైన పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ఛత్తీస్‌గఢ్ బాలిక (9)కు సికింద్రాబాద్ కిమ్స్ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో ఉపశమనం కల్పించారు.
KIMS | బేగంపేట, సెస్టెంబర్ 12: పుట్టుకతోనే విపరీతమైన గూనితోపాటు వెన్నెముకపై అసాధారణమైన పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ఛత్తీస్‌గఢ్ బాలిక (9)కు సికింద్రాబాద్ కిమ్స్ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో ఉపశమనం కల్పించారు. వైద్య పరిభాషలో ‘కోజెనిటల్ డోర్సల్ కైఫోసిస్’గా పిలిచే ఈ సమస్యను సుదీర్ఘ శస్త్రచికిత్సతో విజయవంతంగా పరిష్కరించారు.
వెన్నెముకలోని ఎముకలు అసంపూర్తిగా ఏర్పడటంతో ఈ సమస్య తలెత్తినట్టు వైద్య పరీక్షల్లో తేలిందని, ఎంతో సంక్లిష్టమైన ఈ సమస్యను సరిగ్గా పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆ బాలికకు పక్షవాతం వచ్చే ముప్పు ఉన్నదని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో కార్డియాలజిస్టులు, పల్మనాలజిస్ట్‌ల అభిప్రాయాలను తీసుకుని దాదాపు 6 గంటలపాటు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని వివరించారు. ఈ శస్త్రచికిత్సలో భాగంగా ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్‌తోపాటు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా రోగి త్వరగా కోలుకోగలిగేలే చేసినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

