విద్యుత్తు షాక్‌తో యువరైతు మృతి
పొలంలో నాటు వేయడానికి వెళ్లిన యువరైతు విద్యుత్తు షాక్‌తో మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌లో శుక్రవారం చోటుచేసుకున్నది.
- ప్రాణం తీసిన అధికారుల నిర్లక్ష్యం
ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డి రూరల్, జూలై 19: పొలంలో నాటు వేయడానికి వెళ్లిన యువరైతు విద్యుత్తు షాక్‌తో మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌లో శుక్రవారం చోటుచేసుకున్నది. అన్నాసాగర్‌కు చెందిన కొనగొల్ల రవి (35)కి భార్య చంద్రకళ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శుక్రవారం తన పొలంలో నాటు వేయడానికి గంపలో వరి నారు పెట్టుకొని వెళ్తుండగా, 11 కేవీ విద్యుత్తు వైర్లు నారుకు తగిలి షాక్ రావడంతో రవి అక్కడే పడిపోయాడు.
స్థానికులు వెంటనే ఎల్లారెడ్డి దవాఖానకు తరలించగా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే రవి మృతి చెందాడని, వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఏడీఈ సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. 11కేవీ విద్యుత్తు వైర్లు తక్కువ ఎత్తులో ఉన్నాయని, వాటిని సరిచేయాలని నెల క్రితమే ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం చేయడంతోనే రవి మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

