ఎంపీడీవోల అల్పాహారంలో పురుగులు
కాంగ్రెస్ సర్కార్ పాలనలో గురుకులాల్లోని విద్యార్థులకు పురుగుల అన్నం అనే వార్తా కథనాలను తరచూ చూస్తున్నాం.. అయితే అధికారులకు ఇచ్చే శిక్షణలోనూ అదే అంతు జరుగటంతో అధికారులు అసహనం వ్యక్తంచేశారు.
- ఆందోళన వ్యక్తం చేసిన శిక్షణ అధికారులు
- బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ పాలనలో గురుకులాల్లోని విద్యార్థులకు పురుగుల అన్నం అనే వార్తా కథనాలను తరచూ చూస్తున్నాం.. అయితే అధికారులకు ఇచ్చే శిక్షణలోనూ అదే అంతు జరుగటంతో అధికారులు అసహనం వ్యక్తంచేశారు. వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థ (టీజీ పీఆర్ఆర్డీ)లో రాష్ట్రవ్యాప్తంగా మూడో బ్యాచ్ ఎంపీడీవో, ఎంపీవోలకు మూడు రోజులుగా వృత్తిపరమైన శిక్షణ ఇస్తున్నారు.
దీనిలోభాగంగా శిక్షణకు హాజరైన అధికారులకు శిక్షణ ప్రాంగంణంలోనే వసతి ఏర్పాటు చేశారు. వీరందరికి శిక్షణ కాలం వరకు అల్పాహారం, భోజనం అక్కడే ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం అల్పాహారంగా పెట్టిన మైసూర్ బోండాలో పురుగులు రావడంతో ఎంపీడీవోలు, ఎంపీవోలు తీవ్ర ఆందోళన చెందారు. మండలస్థాయిలో ఉన్నతాధికారులకు ఏర్పాటు చేసే వసతుల విషయంలో పీఆర్ఆర్డీ సంస్థ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

