హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25వ తేదీ నుంచి 30 వరకు నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాలను జయప్రదం చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ప్రజాభవన్ నుంచి మంత్రి వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఒకప్పుడు చిన్న పొదుపుతో ప్రారంభమైన స్వయం సహాయక సంఘాలు.. నేడు తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అతివలు ఆదాయ వనరులు సృష్టించుకొనే దిశగా ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనందిస్తున్నదని చెప్పారు.