సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్
గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో రెండు మహిళా శక్తి క్యాంటీన్లను మంత్రి ప్రారంభించారు.
- ప్రారంభించిన మంత్రి సీతక్క
హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో రెండు మహిళా శక్తి క్యాంటీన్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘మహిళా శక్తి క్యాంటీన్లలో ఆహారం రుచి అమ్మ చేతి వంటలా ఉండాలి. నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలి. ఇప్ప పువ్వు లడ్డులాంటి పల్లె రుచులను పట్టణాలకు పరిచయం చేయాలి. ఈ క్యాంటీన్లు ఓ బ్రాండ్‌గా ఎదిగి దేశానికే ఆదర్శంగా నిలువాలి’ అని సూచించారు. స్థానిక వనరులు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మహిళా శక్తి బిజినెస్ మాడల్స్ రూపొందిస్తామని, రానున్న ఐదేండ్లలో మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందిస్తామని మంత్రి తెలిపారు. మీ సేవ, ఆధార్ కేంద్రాలు, పౌల్ట్రీ, డెయిరీ వ్యాపారాలు, క్యాంటీన్లు, స్టార్టప్‌ల ఏర్పాటుకు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందించడంతోపాటు వడ్డీలేని రుణ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ముఖ్యమంత్రి కార్యదర్శులు మానిక్ రాజ్, చంద్రశేఖర్‌రెడ్డి, సెర్ప్ డైరెక్టర్లు గోపాల్‌రావు, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

