మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
నేతి విద్యాసాగర్ | మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని రాష్ట శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అన్నారు.

నారాయణపేట : మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని రాష్ట శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సింగారం చౌరాస్తా సమీపంలో డీఆర్డీవో ఆధ్వర్యంలో మహిళల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఉన్న మహిళలలోని నైపుణ్యాన్ని, ప్రతిభను గుర్తించి వెలిక్కి తీయడానికి, వారి జీవనోపాధుల పెంపునకు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని ఆయన కోరారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఇచ్చే శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలని మండలి డిప్యూటీ చైర్మన్ మహిళలకు సూచించారు.
గత ఏడాది కొవిడ్ వల్ల ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న సమయంలో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు మాస్కులు తయారు చేసి వాటిని విక్రయించి నారాయణపేట కు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారని కలెక్టర్ హరిచందన తెలిపారు. మాస్కులు అమ్మగా వచ్చిన లాభం తోనే ప్రస్తుతం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను నిర్మించినట్లు మండలి వైస్ చైర్మన్ దృష్టికి తీసుకుపోయారు.

కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ వనజమ్మ, నారాయణపేట, మక్తల్ శాసన సభ్యులు యస్. రాజేందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్డీవో కాళిందిని, ఆర్డీవో వెంకటేశ్వర్లు, నారాయణపేట మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

