నల్లగొండలో కుప్పకూలిన చాపర్.. మహిళా పైలట్ మృతి
నల్లగొండ : నల్లగొండ జిల్లా పెద్దవూర పోలీసు స్టేషన్ పరిధిలోని తుంగతుర్తి గ్రామ సమీపంలో శనివారం ఉదయం 10:50 గంటలకు చాపర్ కుప్పకూలిపోయినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు. ఘటనాస్థలిని పరిశీలించిన అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు.
స్థానిక రైతులు, కూలీలు సమాచారం అందించిన వెంటనే లోకల్ పోలీసులు, సర్పంచ్, ఉప సర్పంచ్ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారని తెలిపారు. సెస్నా 152 అనే చాపర్ క్రాష్ అయినట్లు నిర్ధారించామని తెలిపారు. ఇది సాధారణ ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అని పేర్కొన్నారు. దీన్ని శిక్షణతో పాటు వ్యక్తిగత అవసరాలకు కూడా వినియోగిస్తారు. ప్రమాదానికి గురైన చాపర్‌ను మాచర్లలోని ఓ ప్రయివేటు ఏవియేషన్ అకాడమీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్‌గా గుర్తించామన్నారు. శిక్షణలో భాగంగా తమిళనాడుకు చెందిన ట్రైనీ పైలట్ మహిమ.. ప్రయివేటు ఏవియేషన్ అకాడమీ నుంచి ఉదయం 10:30కి టేకాఫ్ అయింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై డీజీసీఏ, పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు.

భారీ శబ్దాలు.. దట్టమైన పొగలు
చాపర్ కూలిన సమయంలో భారీ శబ్దం వినిపించిందని స్థానిక రైతులు, కూలీలు పేర్కొన్నారు. దట్టమైన మంటలు, పొగలు వచ్చినట్లు తెలిపారు. హెలికాప్టర్ కూలిన వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు. నాగార్జున సాగర్ వైపు నుంచి హెలికాప్టర్ వచ్చినట్లు రైతులు పేర్కొన్నారు.
ఫ్లైటెక్ ఏవియేషన్‌కు చెందిన చాపర్
ప్రమాదానికి గురైన చాపర్‌ను మాచర్ల మండలం నాగార్జున సాగర్ విజయపురిసౌత్‌లో ఉన్న ఫ్లైటెక్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్‌గా పోలీసులు గుర్తించారు. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో అదుపుతప్పి చాపర్ కుప్పకూలినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

