TSRTC | బస్ కండక్టర్ను చెప్పుతో కొట్టిన మహిళ
బస్సుల్లో ఆర్టీసీ (TSRTC) సిబ్బందిపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వారల క్రితం ఎల్బీ నగర్లో చిల్లర ఇవ్వమని అడిగినందుకు ఓ మహిళా ప్రయాణికురాలు కండక్టర్ను కాలితో తన్నిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: బస్సుల్లో ఆర్టీసీ (TSRTC) సిబ్బందిపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వారల క్రితం ఎల్బీ నగర్లో చిల్లర ఇవ్వమని అడిగినందుకు ఓ మహిళా ప్రయాణికురాలు కండక్టర్ను కాలితో తన్నిన విషయం తెలిసిందే. తాజాగా తాను దిగాల్సిన చోట బస్సు ఆపలేదని ఆగ్రహించిన ఓ మహిళ కండక్టర్ను చెప్పుతో కొట్టింది. శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన ప్రసన్న.. బస్సులో శివరాంపల్లి వద్ద ఓ మహిళ ఎక్కింది. ఆమె హైదర్గూడ కల్లు కంపౌండ్ ప్రాంతంలో దిగాల్సి ఉండగా బస్సు అత్తాపూర్లో దిగింది.
అయితే మళ్లీ వెనక్కి వెళ్లేందుకుగాను రోడ్డు దాటి మెహదిపట్నం నుంచి ఉప్పల్ వెళ్తున్న 300 నంబర్ బస్సు ఎక్కింది. సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న బస్టాప్లో దిగేందుకు ప్రయత్నించగా కండక్టర్ ముత్యాల నర్సింహ ఆమెను ఎక్కడ దిగాలని అడిగారు. దీంతో ఆగ్రహానికి లోనైన ప్రసన్న మహిళలకు ఉచితంగా బస్సులు ఎందుకు నడుపుతున్నారంటూ.. ఆయనను చెప్పుతో కొట్టింది. తోటి ప్రయాణికులు ఆమెను అడ్డుకుని బస్సును రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే బస్సు పీఎస్ వద్ద ఆగగానే ఆమె అక్కడి నుంచి పరారైంది. కండక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

