కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి పథకాలపై కేంద్రం ప్రశంసలు
Kalyana Laxmi | రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి పథకాలపై మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ బృందం ప్రశంసల జల్లు కురిపించింది. ఈ రెండు పథకాలు పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని ఆ బృందం

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి పథకాలపై మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ బృందం ప్రశంసల జల్లు కురిపించింది. ఈ రెండు పథకాలు పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని ఆ బృందం ప్రశంసించింది. మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ బృందం రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా సోమవారం ఆ ఎంపీల బృందం హైదరాబాద్‌లో పర్యటించింది. తాజ్ కృష్ణలో మహిళా కమిషన్‌తో మహిళా ఎంపీల బృందం భేటీ అయి పలు అంశాలపై చర్చించింది. అమీర్‌పేటలోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ శాఖ చేపడుతున్న కార్యక్రమాలను పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా కమిషనర్ దివ్య దేవరాజన్ వివరించారు. గర్భిణీ మహిళలకు ఇస్తున్న కేసీఆర్ కిట్ గురించి ప్రత్యేకంగా వివరించారు.
న్యూట్రీ గార్డెన్‌పై ప్రశంసలు
కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యూట్రీ గార్డెన్ వివరాలను ఆ ఎంపీల బృందం ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే గొప్ప కార్యక్రమం అంటూ కితాబిచ్చారు. న్యూట్రీ గార్డెన్ వలన పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు జరుగుతుంది అంటూ ప్రశంసించారు. ఇలాంటి న్యూట్రీ గార్డెన్ దేశంలో ఎక్కడ లేదు, తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక్క దిక్సూచి అంటూ ఎంపీల బృందం కొనియాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

