Private Bus | బోల్తాపడిన ప్రైవేటు బస్సు.. మహిళ సజీవదహనం
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Bus) 44వ జాతీయ రహదారిపై ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది.
గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Bus) 44వ జాతీయ రహదారిపై ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది (Overturn). దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. మంటల్లో చిక్కుకుని మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని కర్నూలు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతురాలిని మెహిదిపట్నానికి చెందిన మాలతిగా గుర్తించారు. బస్సు మియాపూర్ నుంచి చిత్తూరు వెళ్తున్నదని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ఉన్నారని తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

