హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ‘ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలనే లక్ష్యంతో ప్రభు త్వం నల్లగొండలో చేపట్టిన ఐటీ హబ్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.
నల్లగొండ ఐటీ హబ్ ఎంతో అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నదని, కొద్ది నెలల్లోనే ప్రారంభానికి సిద్ధమవుతున్నది’.. అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ ‘సొనాటా సాఫ్ట్వేర్’ నల్లగొండ ఐటీ హబ్‌కు రానుండటం సంతోషంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.