హైదరాబాద్: హోలీ (Holi) పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో (Hyderabad) రెండు రోజులపాలటు మద్యం దుకాణాలు (Wine shops) బంద్ కానున్నాయి. రాచకొండ కమిషనరేట్ (Rachakonda commissionerate) పరిధిలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్లను మూసివేయనున్నారు. శాంతిభద్రతలకు భంగం కలుగకుండా షాపులు మూసేయాలని ఇప్పటికే వైన్స్ నిర్వాహకులను ఆదేశించామని పోలీసు అధికారులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా మందుతాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇక హోలీ పండుగను జరుపుకోవడానికి జంటనగరాల ప్రజలు సిద్ధమవుతున్నారు. మిక్స్డ్ కల్చర్‌కు వేదికైన హైదరాబాద్‌లో హోలీ వేడుకలు ఎంత ఘనంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అలవసరంలేదు. యువతీ యువకులు పెద్దసంఖ్యలో రోడ్లపై సందడి చేస్తుంటారు. కాలనీలు, హైసింగ్ సొసైటీలు, అపార్ట్మెంట్లలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంటారు. ఈనేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రతీ ఏటా మద్యం దుకాణాలను ముందుగానే మూసేస్తారు.