Minister Niranjan Reddy | రాజకీయ గురువు అద్వానీని రాష్ట్రపతి కాకుండా అడ్డుకున్నదెవరు? : మంత్రి నిరంజన్‌రెడ్డి
Minister Niranjan Reddy | రాజకీయాల్లో ఓనమాలు నేర్పిన ఎల్కే అద్వానీ(LK Advani)ని రాష్ట్రపతి కాకుండా ఏం చేశావో యావత్ దేశానికి తెలుసని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan reddy) ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi)పై విరుచుకు పడ్డారు.
మరిపెడ, మహబూబాబాద్ : రాజకీయాల్లో ఓనమాలు నేర్పిన ఎల్కే అద్వానీ(LK Advani)ని రాష్ట్రపతి కాకుండా ఏం చేశావో యావత్ దేశానికి తెలుసని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan reddy) ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi)పై విరుచుకు పడ్డారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడలో ఇటీవల హాకా చైర్మన్‌గా నియమితులైన మచ్చ శ్రీనివాస్ రావుకు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ అధికారిక పర్యటనలో తన స్థాయిని మరిచి తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నాయకులపై అనైతికమైన ఆరోపణలు చేశారన్నారు. తెలంగాణ ప్రజలే తన కుటుంబంగా భావించి సీఎం కేసీఆర్(CM KCR) సుభిక్షమైన పాలన అందిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిపై జాతీయ పురస్కారాలు వస్తుంటే మరోపక్క రాజకీయ విమర్శలు చేయడం ఎవరూ హర్షించబోరన్నారు. ఎల్ఐసీ(LIC) పతనం చేయడంతో పాటు పలు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసి కార్పొరేట్ శక్తులైన అదానీ(Adani),అంబానీ(Ambani)లకు అప్పనంగా అప్పగించే ప్రయత్నం చేస్తున్నారన్నారని మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చిన అనంతరం నల్లధనం వెనక్కు తీసి కుటుంబానికి రూ.15లక్షలు అకౌంట్లలో జమ చేస్తామన్న మాటేమైందని ప్రశ్నించారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాల కల్పన ఏమైందో దేశంలోని నిరుద్యోగ యువత కు చెప్పాలన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే మల్టినేషన్ కంపెనీలే రాజ్యమేలుతాయన్నారు. మొత్తం బిజినెస్ కొద్దిమంది చేతుల్లోకి వెళ్లి పోతుందన్న విషయం ఆర్యవైశ్యులు గుర్తించి అప్రమత్తంగా ఉండాలన్నారు
. రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని ప్రశ్నిస్తే సీఎం కేసీఆర్ కుటుంబంపై కుటుంబ పాలన అంటూ ఎదురు దాడి చేస్తున్నట్లు తెలిపారు. పెళ్లాం పిల్లలు లేకపోతేనే సత్యవంతులా అని ప్రశ్నించారు. పెళ్లాం పిల్లలు ఉన్నవాళ్లకే కరుణ,దయ, జాలి, బాధ్యత ఉంటాయన్నారు.అభివృద్ధిలో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత, డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, బానోత్ శంకర్‌నాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ బిందు, జిల్లా గ్రంథాలయం చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నూకల నరేశ్‌రెడ్డి, రామసహాయం రంగారెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోల్డెన్ శారీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన శ్రియా శరణ్.. హాట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న బ్యూటీ!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు ఇద్దరు సంగీత దర్శకులా .. అసలు కథేంటి?
Nallagonda | హాల్‌టికెట్లు ఇచ్చి.. ఫీజులు వసూలు చేసి.. తీరా పరీక్ష రద్దుపై తల్లిదండ్రుల ఆందోళన
BRS | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ .. బీఆర్ఎస్లో చేరిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు
Gene Related Risk | ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెరుగుతున్న జన్యుపరమైన ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

