జనగామ కలెక్టరేట్ ఆర్కిటెక్ట్ ఎవరో తెలుసా..? కేసీఆర్ అభినందలు
జనగామ : జనగామ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ భవన సముదాయాన్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు పరిచయం చేశారు. ఆర్కిటెక్ట్‌తో పాటు భవనాన్ని నిర్మించిన ఈఎన్సీని కూడా పరిచయం చేసి కంగ్రాట్స్ చెప్పారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. జనగామ కలెక్టరేట్ కార్యాలయం కట్టింది కూడా మన తెలంగాణ బిడ్డనే. తెలంగాణకు తెలివే లేదు. బిల్డింగ్లు కట్టుకోవడానికి రానే రాదు. పరిపాలన చేయడం చేతకాదని సమైక్యవాదులు అన్నారు. జనగామ కలెక్టరేట్ బిల్డింగ్ నమూనాను రూపొందించింది ఆర్కిటెక్ట్ ఉషారెడ్డినే. ఈమె యాదగిరిగుట్టకు చెందిన మహిళ అని కేసీఆర్ ప్రశంసించారు. మన ఆడబిడ్డ అయినందుకు గర్విస్తున్నాను.. ఆమెకు శుభాకాంక్షలు. ఈ బిల్డింగ్‌ను వెంబడి ఉండి కట్టించింది కూడా మన ఈఎన్సీ గణపతి రెడ్డినే. వారిది మహబూబ్‌నగర్.. ఆయన తెలంగాణ బిడ్డనే.

ఇలా అనేక మంది మన బిడ్డలే, ఆర్కిటెక్టులే భవనాలను కట్టిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వారిని ప్రోత్సహించి అద్భుతాలు చేయిస్తున్నారు. పవిత్రమైన దేవాలయం లాంటి ఈ కలెక్టరేట్ నుంచే అనేక పనులు జరగాల్సి ఉన్నది. ఒక సమన్వయంతో కలెక్టర్ నాయకత్వంలో ప్రజాప్రతినిధుల సహకారంతో జనగామ జిల్లాలో అద్భుతాలు ఆవిష్కరించాలి అని కేసీఆర్ అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

