Handloom | చేనేత చీరలు కొనేదెవరు?.. నాలుగు నెలలుగా ముఖం చాటేసిన టెస్కో
ప్రభుత్వం, టెస్కో నిర్వాకంతో చేనేత రంగం ఆగమవుతున్నది. వస్త్ర పరిశ్రమ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నది. చేనేత పట్టు చీరల నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోతున్నాయి. ఎప్పటికప్పుడు కొనాల్సిన టెస్కో కనీసం పట్టించుకోకపోవడంతో గిరాకీ లేక కార్మికులకు పని దొరకడంలేదు.
- కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన నిల్వలు
- కోట్లలో నిలిచిపోయిన వస్త్ర బిల్లులు
Handloom | యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం, టెస్కో నిర్వాకంతో చేనేత రంగం ఆగమవుతున్నది. వస్త్ర పరిశ్రమ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నది. చేనేత పట్టు చీరల నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోతున్నాయి. ఎప్పటికప్పుడు కొనాల్సిన టెస్కో కనీసం పట్టించుకోకపోవడంతో గిరాకీ లేక కార్మికులకు పని దొరకడంలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేనేత సహకార సంఘాలు, పవర్‌లూమ్‌లు కలిపి మొత్తం 84 సంఘాలు ఉండగా, ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 43 ఉన్నాయి. వీటిలో 25,800 మంది చేనేత కార్మికులు సంఘ సభ్యులుగా ఉన్నారు. పోచంపల్లి, గట్టుప్పల, పుట్టపాక, నారాయణపురం, భువనగిరి, కొయ్యలగూడెం, చండూరు, మునుగోడు తదితర ప్రాంతాల నుంచి చీరలు ఉత్పత్తి చేస్తారు. చేనేత వస్ర్తాలు మగ్గాలపై నేయించాలని సహకార సంఘాలకు తెలంగాణ రాష్ట్ర సహకార సంస్థ (టెస్కో) ముందుగానే ఆర్డర్ ఇస్తుంది. ఆర్డర్ ఇచ్చాక చేనేత పట్టు చీరలను నేయిస్తారు. మూడు నెలలకోసారి నాలుగు విడుతల్లో వస్ర్తాలను టెస్కో కొనుగోలు చేస్తుంది. కానీ నాలుగు నెలలుగా టెస్కో పట్టించుకోవడం లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్‌లో చీరలను కొనుగోలు చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు మళ్లీ ఇటువైపు చూడలేదు. దీంతో ఉత్పత్తి చేసిన చీరలన్నీ షావుకార్లు, సంఘాల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.8 కోట్ల విలువైన చీరలు నిలిచిపోయాయి. ఒక్క పోచంపల్లి పట్టణంలోని సొసైటీలో రూ.రెండు కోట్లు, చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం సహకారం సంఘంలో రూ.1.10 కోట్ల విలువైన వస్ర్తాలు పేరుకుపోయాయి. అదే విధంగా ఇప్పటికే కొనుగోలు చేసిన వస్ర్తాల బిల్లులు సైతం పెండింగ్‌లో పెట్టారు. నాలుగు నెలలుగా ఒక్కపైసా విడుదల చేయలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.2 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో మూలుగుతున్నాయి. నల్లగొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.
దొరకని ఉపాధి..
పట్టుచీరలు అంతంత మాత్రంగానే అమ్ముడుపోతుండటం, టెస్కో కొనకపోవడంతో నేతన్నలకు ఇబ్బందులు తప్పడంలేదు. చేనేత కార్మికులు మాస్టర్ వీవర్స్ వద్ద కూలికి మగ్గాలు నేస్తుంటారు. కానీ వస్త్ర నిల్వలు పేరుకుపోవడంతో ఉత్పత్తికి ముందుకు రావడంలేదు. దీంతో షావుకార్లు నేతన్నలకు పెద్దగా పని ఇవ్వడంలేదు. కొందరు పని కల్పిస్తున్నా కూలి ఆలస్యంగా ఇస్తున్నారు. మరోవైపు గిరాకీ లేకపోవడంతో కొందరు తక్కువ ధరలకే చీరలను అమ్ముకుంటున్నారు. నేతన్నలు కష్టాల పాలవుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదని, వెంటనే కొనుగోలు చేపట్టాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పనిలేక వీధిన పడే పరిస్థితి
కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు మారెటింగ్ లేక ఉపాధి దొరుకతలేదు. చేనేత సహకార సంఘంలో కోట్ల విలువైన చేనేత వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. వస్త్రాల కొనుగోలు జరగక.. కార్మికులు పని లేక వీధిన పడే పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం నుంచి సంఘాలకు బకాయిలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. పనిలేక వలస వెళ్లే దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం చేనేత రంగాన్ని ఆదుకొని కార్మికులకు పని కల్పించాలి.
– రుద్ర వెంకటేశం, చేనేత కార్మికుడు, భూదాన్ పోచంపల్లి
నిల్వ వస్ర్తాలన్నీ కొనాలి
చేనేత సమస్యల పరిషారం కోసం ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టాలి. కార్మికులకు పనిలేకపోవడంతో అప్పుల భారంతో కూరుకుపోతున్నారు. నేసిన వస్త్రానికి మారెటింగ్ సౌకర్యం కల్పించాలి. నిల్వ ఉన్న వస్త్రాలన్నీ ప్రభుత్వం కొనాలి. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి. సహకార సంఘాలను బలోపేతం చేయాలి. కార్మికులకు పని కల్పించి ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.
– తడక రమేశ్, మాజీ అధ్యక్షుడు, టై అండ్ డై అసోసియేషన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

