నాన్నకు అప్పులిస్తే నాకు సంబంధం లేదు.. సర్పంచ్ అభ్యర్థి కుమారుడి వాట్సాప్ మెసేజ్
కుటుంబంలో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తే అండగా నిలుస్తారు. అయితే ఓ సర్పంచ్ అభ్యర్థి కుటుంబం మాత్రం.. అతను పోటీ చేసేందుకు అప్పులు చేస్తే తమకు ఎలాంటి సంబంధం లేదని వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పంపడం చర్చనీయాంశమైంది.
- హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో విచిత్ర ఘటన
ఎల్కతుర్తి, నవంబర్ 29 : కుటుంబంలో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తే అండగా నిలుస్తారు. అయితే ఓ సర్పంచ్ అభ్యర్థి కుటుంబం మాత్రం.. అతను పోటీ చేసేందుకు అప్పులు చేస్తే తమకు ఎలాంటి సంబంధం లేదని వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పంపడం చర్చనీయాంశమైంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్‌గా ఓ అభ్యర్థి పోటీ చేయడం అతడి కుటుంబసభ్యులకు ఇష్టం లేదు. అయితే అతను వినకపోవడంతో అతడి కుమారుడు గ్రామంలోని వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ పెట్టాడు. ‘మీ అందరికి తెలియజేయునది ఏమనగా.. ఎన్నికల్లో పోటీ చేయవద్దని మా నాన్నగారిని కోరినా వినలేదు. చివరికి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
మా నాన్నగారు పోటీ చేయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మా నాన్నతో ఎవరైనా ఆర్థిక లావాదేవీలు జరిపినా, అప్పులు ఇచ్చినా నాకు ఎలాంటి సంబంధం లేదు. గతంలోనూ రాజకీయాల్లో తిరిగి ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఆ సమయంలో మేమెంతో ఇబ్బంది పడ్డాం. అందుకే ఈ సారి ఈ మెసేజ్ పెట్టాల్సి వచ్చింది’ అని పేర్కొన్నాడు.ఈ విషయమై సదరు అభ్యర్థిని సంప్రదించగా, తన ఎదుగుదల చూడలేకనే ప్రత్యర్థులు తన కుటుంబసభ్యులతో ఇలాంటి పోస్ట్‌లు పెట్టిస్తున్నారని ఆరోపించారు. తాను ఇలాంటి వాటిని పట్టించుకోనని, ప్రజాబలంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

