ఎలుకలు కొరికితే మీరేం చేస్తున్నరు?.. గురుకులాల్లో ఇంత అధ్వానమా?.. ఎర్రబెల్లి ఆగ్రహం
‘గురుకులాలను ఇంత అధ్వానంగా నడుపుతారా? విద్యార్థినులను ఎలుకలు కొరికేంత పరిస్థితి వచ్చే వరకు మీరేం చేస్తున్నారు’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురుకులం నిర్వాహకులను ప్రశ్నించారు.
- రేవంత్ పాలనలో విద్య నిర్వీర్యం
- పాలకుర్తి గురుకుల విద్యార్థినులను ఎలుకలు కొరుకడంపై మండిపాటు
- గురుకులంలోకి అనుమతించకపోవడంతో అక్కడే బైఠాయించి ధర్నా
- ఘటనపై కలెక్టర్, గురుకులాల కార్యదర్శికి ఫోన్లో ఫిర్యాదు
పాలకుర్తి, సెప్టెంబర్ 25 : ‘గురుకులాలను ఇంత అధ్వానంగా నడుపుతారా? విద్యార్థినులను ఎలుకలు కొరికేంత పరిస్థితి వచ్చే వరకు మీరేం చేస్తున్నారు’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురుకులం నిర్వాహకులను ప్రశ్నించారు. గురుకులాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు కనీస భద్రత కల్పించకపోవడం సిగ్గుచేటని అన్నారు. రేవంత్రెడ్డి మూడేండ్ల పాలనలో రాష్ట్రంలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయిందని ధ్వజమెత్తారు. జనగామ జిల్లా పాలకుర్తిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో 14 మంది విద్యార్థినులను ఎలుకలు కొరికిన నేపథ్యంలో శుక్రవారం ఎర్రబెల్లి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పేందుకు పాఠశాలకు వచ్చారు.
ఈ క్రమంలో పాఠశాల గేట్ వద్ద సీఐ భరత్ సుమన్, ఎస్సై దూలం పవన్కుమార్ పోలీసు సిబ్బందితో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఎర్రబెల్లి వెంటనే గురుకులాల సొసైటీ కార్యదర్శితోపాటు కలెక్టర్కు ఫోన్ చేసి జరిగిన ఘటనను వివరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలలోకి అనుమతించకపోవడంతో పాఠశాల గేటు ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పోలీసులను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తున్నదని మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో దొంగల పాలన నడుస్తున్నదని దుయ్యబట్టారు.
ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థినుల జీవితాలు అయోమయంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినులను ఎలుకలు కొరికినా స్థానిక ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం చేసిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో రైతాంగానికి నాణ్యమైన విద్యుత్తు అందడం లేదని పేర్కొన్నారు. 24 గంటల కరెంట్ మాట దేవుడెరుగు.. కనీసం 6 గంటల కరెంట్ కూడా ఇవ్వని దుస్థితి నెలకొన్నదని విమర్శించారు. పాలకుర్తి నియోజకవర్గంలో గోదావరి జలాలు పారకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 22ఏ పేరుతో పేదల భూములను సర్కార్ గుంజుకుంటున్నదని ఆరోపించారు. తన 45 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇంతటి దుర్మార్గమైన సీఎంను చూడలేదని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్షిప్స్లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

