హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): చికటి అడవి.. ప్రకృతి రమణీయత.. జలపాతాలతో అలరారుతున్న కవ్వాల్ పులుల రక్షిత అటవీ ప్రాంతానికి సంబంధించిన పూర్తి సమాచారంతో అటవీశాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. మంగళవారం అరణ్యభవన్‌లో అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి www.kawaltiger.com వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కవ్వాల్ అటవీ ప్రాంతం ప్రత్యేకత, విస్తరించిన ప్రాంతాలు, జంతువులు, పక్షులు, చెట్ల జాతుల వివరాలు, దర్శనీయ స్థలాలతోపాటు, ఎకో టూరిజం ప్రాంతాలు, సఫారీ, ఆన్లైన్ బుకింగ్ వివరాలను ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. కవ్వాల్ అటవీ ప్రాంతంలో అభివృద్ధి చేసిన గడ్డి మైదానాలపై (గ్రాస్లాండ్స్) ప్రత్యేక బుక్‌లెట్‌తో పాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వు వార్షిక పరిపాలన నివేదికను కూడా విడుదల చేశారు. కార్యక్రమంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి, ఫీల్డ్ డైరెక్టర్ వినోద్‌కుమార్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్, పీసీసీఎఫ్ పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైశ్వాల్, అమ్రాబాద్, కవాల్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.