మరో ప్రపంచం వెబ్ 3.0.. ఇంటర్నెట్ ప్రపంచంలోకి సరికొత్త తరం
- త్వరలో మూడోతరం వెబ్ టెక్నాలజీ
- ఇక రోజువారీ పనులు డిజిటల్లోనే!
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం ఇంట్లో కూర్చొని షాపింగ్ వెబ్సైట్లలో కనిపించే వస్తువులలో మనకు అవసరమైనవాటిని కొనుగోలు చేస్తున్నాం. ఇకపై మీ కంప్యూటర్లోనో లేక ఫోన్లోనో మీ అవతార్‌ను సృష్టించుకొని దాని ద్వారా ప్రత్యక్షంగా మీకిష్టమైన షాపింగ్ మాల్లో విహరించి రావొచ్చు. ఆ మాల్లో ఓ దుకాణంలోకి వెళ్లి మీకు అవసరమైన వస్తువును పరిశీలించి, వస్ర్తాలైతే ధరించి చూసి ఆపై కొనుగోలు చేయవచ్చు. ఇదంతా తరువాతి తరం (నెక్ట్స్ జనరేషన్) ఇంటర్నెట్గా పేర్కొంటున్న వెబ్ 3.0లో సాధ్యం కానున్నది. ఇంటర్నెట్ నెట్ వేదికగా వెబ్సైట్లలో చూడని ఎన్నో ప్రత్యేకతలు, ప్రయోజనాలు వెబ్ 3.0లో కనిపించనున్నాయి. కృత్రిమ మేథస్సు (ఏఐ) ఇందులో కీలకం కానుంది. మెటావర్స్, ఎన్ఎఫ్టీ ద్వారా ఇప్పటికే వెబ్ 3.0 ఆదరణ పొందుతున్నది. వెబ్ 3.0 ద్వారా ఫలితాలు ఎంతో ప్రభావవంతంగా ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఇంటర్నెట్ మెకానిజాన్ని పూర్తిగా తల్లకిందులు చేసేలా వెబ్ 3.0 ఉండబోతున్నదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వెబ్ 3.0లో మెటావర్స్ ప్రత్యేకం
మెటావర్స్ అనగా కంప్యూటర్లో సృష్టించిన ఓ కల్పిత ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించే వేదిక. భౌతికంగా లేకపోయినా అవతార్ల రూపంలో అందరూ ఒక చోట చేరి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. చర్చలు, సమావేశాలు ఇలా భౌతిక ప్రపంచంలో చేసేవన్నీ మెటావర్స్ టెక్నాలజీతో సాధ్యమవుతుంది. వెబ్ 3.0 ద్వారా మెటావర్స్ అందుబాటులోకి రానుంది.
ఇంటర్నెట్లో సరికొత్త ప్రపంచమే:సాయి తేజ, ఐటీ నిపుణులు
సుమారు 30 ఏండ్ల క్రితం ప్రారంభమైన ఇంటర్నెట్ (వరల్డ్ వైడ్ వెబ్)లో ఎన్నో పరిమితులు ఉండేవి. కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆయా టెక్నాలజీల కలబోత ఇంటర్నెట్ను ఒక తరం నుంచి మరో తరానికి తీసుకెళ్తున్నాయి. ఇప్పటివరకు రెండు తరాల ఇంటర్నెట్ ప్రపంచంలో విహరించిన మనకు తరువాతి తరం అయిన వెబ్ 3.0 మరింత ఆధునికంగా మన ముందుకు వచ్చింది. మెటావర్స్, ఆర్ట్ గ్యాలరీస్, బిజినెస్ ఆఫీసెస్, గేమ్స్, కాసినోస్, మ్యూజిక్ వెన్యూస్, పేమెంట్ నెట్ వర్స్, డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్, ఎన్ఎఫ్టీ సావర్జీన్ ఫైనాన్స్… ఇలా ఎన్నో సేవలు వెబ్ 3.0 వేదికగా మనం పొందవచ్చు.
వెబ్ 3.0 అంటే
తరువాతి తరం ఇంటర్నెట్నే వెబ్ 3.0గా పేర్కొంటున్నారు. ఇందులో వెబ్సైట్లు, యాప్‌లు, మెషీన్ లెర్నింగ్, బిగ్ డాటా, వికేంద్రీకృత సాంకేతిక పరిజ్ఞానం ఉంటాయి. మనుషుల తరహాలోనే డాటాను నిర్వహించేగలగటం దీని ప్రత్యేకత. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఇంటర్నెట్ 2.0లో డాటా.. సెంట్రలైజ్డ్ రిపాజిటర్స్పై ఆధారపడి ఉంటుంది. దీనికంటే అత్యంత అధునాతనంగా 3.0ను రూపొందించారు.
ఇందులో డాటా డీ సెంట్రలైజ్డ్ విధానంలో ఒకదానితో ఒకటి అనుసంధానమవుతుంది. వినియోగదారులు, యంత్రాలు డాటాను నిర్వహిస్తాయి. ఇది జరగేందుకు మనిషి ఆలోచించినట్లుగా ఆలోచించే కృత్రిమ మేథస్సును వినియోగించాలి. దీనివల్ల వెబ్ 3.0 అత్యుత్తమంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

