త్వరలోనే పర్దీపూర్ లిఫ్ట్ చేపడతాం
మంత్రి నిరంజన్ రెడ్డి | జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలోని వాగులన్నిటిపై చెక్ డ్యామ్ లు నిర్మించడం ద్వారా నియోజక వర్గాన్ని పారే జీవనదిలా మారుస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు

మహబూబ్ నగర్ : జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలోని వాగులన్నిటిపై చెక్ డ్యామ్ లు నిర్మించడం ద్వారా నియోజక వర్గాన్ని పారే జీవనదిలా మారుస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన దేవరకద్ర నియోజకవర్గంలోని సీసీ కుంట, వడ్డేమాన్, లాల్కోట, పర్దీపూర్ లలో నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించడంతో పాటు, పల్లమర్రిలో రూ.5.74 కోట్లతో నిర్మించనున్న చెక్ డ్యామ్ కు శంకుస్థాపన చేశారు.
గోప్యానాయక్ తండా నుండి పర్దిపూర్ వరకు రూ.2.5 కోట్లతో నిర్మించే బి.టి రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేవరకద్ర నియోజకవర్గంలోని ఊక చెట్టు వాగుపై ఇదివరకే 9 పెద్ద చెక్ డ్యామ్ లను చేపట్టామన్నారు. ఈ వాగుపై సుమారు 36 కిలోమీటర్ల మేర అవసరమైనన్ని చెక్ డ్యామ్ లు నిర్మించి ఎక్కడి నీటిని అక్కడే సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించి నియోజకవర్గం మొత్తన్ని పారే జీవనదిలా మారుస్తామని మంత్రి తెలిపారు. ఇటీవలే సీఎం కేసీఆర్ పేరూరు లిఫ్ట్ ను మంజూరు చేశారని, సాధ్యమైనంత త్వరగా పర్దిపూర్ లిఫ్ట్ ను కూడా చేపడతామని మంత్రి వెల్లడించారు.
రాబోయే రోజుల్లో వరి పంటను తగ్గించాల్సిన అవసరం ఉందని, వరికి బదులుగా రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని మంత్రి సూచించారు. ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక పద్ధతులు, యంత్ర పరికరాలు వినియోగించడం ద్వారా వ్యవసాయాన్ని సాగు చేస్తే అత్యధిక లాభాలు సాధించవచ్చన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇచ్చిన మాట, చేసిన వాగ్ధానాన్ని మరువను
బహుజన తత్వవేత్త జ్యోతిరావు పూలే : మంత్రి పువ్వాడ
‘మల్లన్న’ క్షేత్రంలో భక్తుల కోలాహాలం
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే : మంత్రి ఐకే రెడ్డి
గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి రావు ఫూలే
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

