వరంగల్ అర్బన్ ఇక హన్మకొండ జిల్లా

హైదరాబాద్ : వరంగల్, హన్మకొండ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. చారిత్రక ప్రదేశాలకు ప్రభుత్వం చక్కని గుర్తింపునిచ్చింది. వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండగా, వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ జిల్లా మార్చుతూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందిస్తూ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు సీఎం తీసుకున్న ఈ నిర్ణయాన్ని యావత్తు పూర్వ వరంగల్ జిల్లా ప్రజలంతా ముక్త కంఠంతో అభినందిస్తున్నారని మంత్రి చెప్పారు.
తాజా మార్పుతో జిల్లాల స్వరూపం :
హన్మకొండ జిల్లా :
12 మండలాలతో హన్మకొండ జిల్లా, 15 మండలాలతో వరంగల్ జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హన్మకొండ జిల్లాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం మొత్తం కలుస్తుండగా, స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన ధర్మసాగర్, వేలేరు, పరకాల నియోజకవర్గానికి చెందిన పరకాల, నడికుడ, దామెర మండలాలు, హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు, హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కమాలాపూర్ కలిశాయి. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఐనవోలు, హసన్‌పర్తి మండలాలు కూడా హన్మకొండ జిల్లాలోనే ఉన్నాయి.
వరంగల్ జిల్లా :
వరంగల్ జిల్లాలో ప్రస్తుత వరంగల్ నియోజకవర్గం మొత్తం ఉంటుంది. పరకాల నియోజకవర్గానికి చెందిన గీసుగొండ, ఆత్మకూరు, శాయంపేట, సంగెం మండలాలు, వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి వర్ధన్నపేట, పర్వతగిరి, పాలకుర్తి నియోజకవర్గం నుంచి రాయపర్తి, నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలు నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ వరంగల్ జిల్లాలో ఉన్నాయి. వరంగల్ జిల్లాలో వరంగల్, పరకాల రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కొత్తగా కమాలాపూర్ మండలం పరకాల పరిధిలోకి రావడం గమనార్హం.
కొత్తగా ఏర్పడబోయే హన్మకొండ జిల్లాలో 12 రెవెన్యూ మండలాలు, 139 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అలాగే వరంగల్ జిల్లాలో 15 రెవెన్యూ మండలాలు, 217 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. రెండు రెవిన్యూ డివిజన్లు, ఆరు నియోజకవర్గాల సమ్మిళితంతో హన్మకొండ జిల్లా అవతరించింది. ఐదు నియోజకవర్గాల సమ్మిళితంతో, రెండు రెవెన్యూ డివిజన్లు (వరంగల్, నర్సంపేట)తో వరంగల్ జిల్లా అవతరించింది.
హన్మకొండ జిల్లాలోని మండలాలు(12) :
హన్మకొండ, కాజీపేట, ఐనవోలు, హసన్‌పర్తి, వేలేరు, ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమాలాపూర్, పరకాల, నడికూడ, దామెర.
వరంగల్ జిల్లాలోని మండలాలు(15) :
వరంగల్, ఖిలావరంగల్, గీసుగొండ, ఆత్మకూరు, శాయంపేట, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, సంగెం, నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్, నెక్కొండ.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

