British Deputy High Commissioner | వరంగల్ ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటక ప్రాంతం .. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ప్రశంస
British Deputy High Commissioner | వరంగల్ గొప్ప ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటక ప్రాంతమని తెలంగాణ, ఏపీ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ( Gareth Win Owen ) అన్నారు.
వరంగల్ : వరంగల్ గొప్ప ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటక ప్రాంతమని తెలంగాణ, ఏపీ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ( Gareth Win Owen ) అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన హనుమకొండలోని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Minister Errabelli Dayakar Rao) ను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తాను ఉమ్మడి జిల్లాలోని స్థానిక చారిత్రక, ఆధ్యాత్మిక Spiritual) , పర్యాటక ప్రాంతాలను చూస్తున్నానని, ఈ ప్రాంతం మంత్ర ముగ్ధుడిని చేసిందని అన్నారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, రైతులకు అందుతున్న సాగునీరు, పంటలు, ప్రజల జీవన ప్రమాణాలు పెంపు వంటి అంశాల మీద కూడా మంత్రితో మాట్లాడి అభినందించారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి, బమ్మెర, వల్మీడి లాంటి చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, ఆ ప్రాంతాలను కూడా సందర్శించాలని కమిషనర్‌ను మంత్రి కోరారు. అనంతరం బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ను మంత్రి దయాకర్ రావు సత్కరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

