Chinna Reddy | చిన్నారెడ్డి హఠావో.. కాంగ్రెస్ బచావో.. వనపర్తిలో పార్టీ కార్యకర్తల తిరుగుపాటు
‘చిన్నారెడ్డి హఠావో... కాంగ్రెస్ బచావో’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డిపై వనపర్తి నియోజకవర్గ కార్యకర్తలు తిరుబాటు జెండా ఎగరేశారు. చిన్నారెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వొద్దని హెచ్చరిస్తున్నారు. ఆయన స్థానంలో ఇంకెవరికిచ్చినా తమకు అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. ఆదివారం గాంధీభవన్‌ను వచ్చిన నియోజకవర్గ కార్యకర్తలు ఎన్నికల కమిటీ సభ్యులకు వినతిపత్రాలు అందజేశారు.
- చిన్నారెడ్డిపై వనపర్తి కాంగ్రెస్ కార్యకర్తల తిరుగుబాటు
- టికెట్ ఇవ్వొద్దంటూ గాంధీభవన్‌లో వినతిపత్రాలు
Chinna Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ): ‘చిన్నారెడ్డి హఠావో… కాంగ్రెస్ బచావో’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డిపై వనపర్తి నియోజకవర్గ కార్యకర్తలు తిరుబాటు జెండా ఎగరేశారు. చిన్నారెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వొద్దని హెచ్చరిస్తున్నారు. ఆయన స్థానంలో ఇంకెవరికిచ్చినా తమకు అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. ఆదివారం గాంధీభవన్‌ను వచ్చిన నియోజకవర్గ కార్యకర్తలు ఎన్నికల కమిటీ సభ్యులకు వినతిపత్రాలు అందజేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్, మహేశ్‌కుమార్ గౌడ్, అజారుద్దీన్, పొన్నాల లక్ష్యయ్య, ఇలా ఒక్కొక్కరిని కలుస్తూ… చిన్నారెడ్డికి టికెట్ ఇవ్వొద్దని వినతిపత్రం ఇస్తున్నారు.
ఒకవేళ ఆయనకు టికెట్ ఇస్తే, వనపర్తిలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని స్పష్టం చేశారు. చిన్నారెడ్డికేకి టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికెట్‌ను విష్ణువర్ధన్‌రెడ్డి ఆశిస్తుండగా తాను కూడా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తానని అజారుద్దీన్ ప్రకటించారు. విష్ణు వ్యతిరేకవర్గం నేతలతో ఆదివారం సమావేశమయ్యారు. అజారుద్దీన్‌పై విష్ణువర్ధన్‌రెడ్డి పీసీసీతోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తాజాగా అజారుద్దీన్ మరోసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై దృష్టి పెట్టడంతో కాంగ్రెస్‌లో గందరగోళ పరిస్థితి నెలకొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
Allu Arjun | చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు!
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

