TTD | తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం.. మార్చి 24 నుంచి అమలు
TTD | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పించనుంది. ఈ విధానం మార్చి 24 నుండి అమల్లోకి రానుంది.
TTD | హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పించనుంది. ఈ విధానం మార్చి 24 నుండి అమల్లోకి రానుంది.
ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుండి సిఫార్సు లేఖలను ఆది, సోమవారాల్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా రూ. 300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురువారాలలో మాత్రమే స్వీకరించడం జరుగుతుందని తెలియజేయడమైనది. (ఒకరికి ఒక సిఫార్సు లేఖను మాత్రమే 06 మందికి మించకుండా స్వీకరించడం జరుగుతుంది).
ఇప్పటివరకు సోమవారం విఐపి బ్రేక్ దర్శనానికి గాను ఆదివారం ఆంధ్ర ప్రజా ప్రతినిధుల నుండి స్వీకరిస్తున్న సిఫార్సు లేఖలు ఇకపై శనివారం నాడు (ఆదివారం దర్శనం కొరకు) స్వీకరించబడతాయి. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలను, ఇతర భక్తుల దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘంగా చర్చించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం టిటిడి ఈ మేరకు నిర్ణయించింది. ఈ మార్పులను భక్తులు దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించవలసిందిగా కోరడమైనది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

