వాసాలమర్రి గ్రామస్తులతో సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం
సహపంక్తి భోజనం | వాసాలమర్రి గ్రామస్తులతో కలిసి సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం చేశారు. ఇక భోజనం చేస్తున్న మహిళల వద్దకు వెళ్లి సీఎం కేసీఆర్

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వాసాలమర్రి గ్రామస్తులతో కలిసి సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం చేశారు. ఇక భోజనం చేస్తున్న మహిళల వద్దకు వెళ్లి సీఎం కేసీఆర్ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. భోజనాలు ఎలా ఉన్నాయని అడిగారు. కేసీఆర్ ఒక సామాన్యుడిలా వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలుకరించడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలోని 3 వేల మందికి ఒకేసారి భోజన ఏర్పాట్లు చేశారు. వాసాలమర్రిలోని కోదండ రామాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు.
23 రకాల వంటకాలు..
వాసాలమర్రి గ్రామస్తులకు 23 వంటకాలను వడ్డించారు. మటన్, చికెన్, ఆకుకూరలు, బోటీ కర్రి, చేపలు, తలకాయ కూర, కోడిగుడ్డు, రెండు రకాల స్వీట్లు, పాలక్ పన్నీరు, బిర్యానీ, పులిహోర, సాంబార్, పండ్ల రసాలు, ఆలుగడ్డతో పాటు పలు వైరెటీలు చేశారు.



Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

