హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (వీఏవోఏటీ) టీఎస్ఎస్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడిగా డీ వీరాస్వామి, ప్రధాన కార్యదర్శిగా కొరడాల వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. బుధవారం మింట్కంపౌండ్లో వీఏవోఏటీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాపకంటి అంజయ్య సమక్షంలో ఈ నూతన కార్యవర్గం ఎన్నికైంది. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా కే కొండల్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా బీ శ్రీనివాసులు, హరీశ్‌కుమార్, అదనపు జనరల్ సెక్రటరీగా ఏ నాగరాజులను ఎన్నుకొన్నారు.