పదేండ్ల తర్వాత ఓయూలో పోలీస్ రాజ్యం: ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి
ఆంధ్రా పాలకులు ఉద్యమా న్ని అణచివేసినట్టు, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగుల పోరాటాన్ని అణచివేయాలని చూస్తున్నదని ఎమ్మార్పీస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు.
ముషీరాబాద్, జూలై 10: ఆంధ్రా పాలకులు ఉద్యమా న్ని అణచివేసినట్టు, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగుల పోరాటాన్ని అణచివేయాలని చూస్తున్నదని ఎమ్మార్పీస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. డీఎస్సీ, గూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని ఓయూలో శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు వచ్చి విద్యార్థులు, జర్నలిస్టులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పదేండ్ల తర్వాత ఓయూలో పోలీస్ రాజ్యం నడస్తున్నదని మండిపడ్డారు.
అన్ని పరీక్షలు 10, 15 రోజుల వ్యవధిలోనే ఉండటం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు వాయిదా కోరుతున్నారని, దాన్ని ప్రభుత్వం రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రెండు మూడు నెలల సమయం ఇస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమిటని ప్రశ్నించారు. విద్యార్థులపై దాడికి ఓయూ ఇన్స్పెక్టర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు శ్రీనివాస్, వెంకట్, చందు, నరేశ్, తిరుమలేశ్, నాగరాజ్, సురేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

