భద్రాద్రిలో జనవరి 3 నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు
Vaikunta Ekadashi | భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి 23వరకు శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల పోస్టర్‌ను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు.

హైదరాబాద్, డిసెంబర్ 28 : భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి 23వరకు శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల పోస్టర్‌ను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు రావాల్సిందిగా దేవాదాయ శాఖ అధికారులు, వేదపండితులు మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు.
మంత్రి అల్లోలకు వేద పండితులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందించారు. అనంతరం మంత్రి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవ ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జనవరి 12న తెప్పోత్సవం, 13న ఉత్తర ద్వార దర్శనాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.
కొవిడ్ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయాలని, భక్తులు కూడా కోవిడ్ నిబంధలను పాటించాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో భద్రాద్రి ఆలయ ఈవో శివాజీ, వేద పండితులు, తదితరులు ఉన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

