Kodangal | కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్లో వలస కూలీల తిరుగుబాటు.. నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు
Kodangal | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోని పోలేపల్లి, హకీంపేట గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్లో వలస కూలీలు తిరుగుబాటు జెండా ఎగరేశారు.
కొడంగల్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) సొంత నియోజకవర్గమైన కొడంగల్ ( Kodangal ) పరిధిలోని పోలేపల్లి, హకీంపేట గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్లో (Education Hub) వలస కూలీలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. తమకు రావలసిన కూలీ డబ్బులను సకాలంలో, సరిగా చెల్లించడం లేదని నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు చేస్తూ గురువారం ఆందోళనకు దిగారు.
ఈ ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనుల కాంట్రాక్టును దక్కించుకున్న కేఎల్ఎస్ఆర్ ( KLSR ) కన్స్ట్రక్షన్ కంపెనీ తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా రాత్రింబవళ్లు ఇక్కడ శ్రమిస్తున్నప్పటికీ, కంపెనీ యాజమాన్యం తమకు ఇవ్వాల్సిన వేతనాలను సక్రమంగా చెల్లించడం లేదని వాపోయారు. ప్రస్తుతం ఈ నిర్మాణ స్థలంలో ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 150 మంది వలస కూలీలు పనిచేస్తున్నారు. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కంపెనీ ప్రతినిధులను అడిగితే సరైన సమాధానం రావడం లేదని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఈ విద్యా హబ్ పనులను పర్యవేక్షిస్తుండ గా, క్షేత్రస్థాయిలో కూలీలకు ఇలాంటి అన్యాయం జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. తమకు న్యాయం జరగకపోతే ఈ వ్యవహారంపై నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ఫిర్యాదు చేస్తామని కూలీలు స్పష్టం చేయడం విశేషం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్లో వలస కూలీల తిరుగుబాటు.. నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు
Miss behave | బాలికకు బొమ్మలిస్తానని నమ్మించి అసభ్య ప్రవర్తన
Collector Kumar Deepak | ప్రభుత్వ భూములు కాపాడేందుకు చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మహిళపై లైంగిక వేధింపులు.. వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష
సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

