Telangana | రైతన్న విత్తన పోరు.. పత్తి గింజల కోసం పడరాని పాట్లు
విత్తనాల కొరతే లేదని ఓ వైపు ప్రభుత్వం చెప్తున్నా, రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు దొరక్క అన్నదాతలకు అగచాట్లు తప్పడం లేదు. సరిపడా విత్తనాలు ఉన్నాయంటున్న వ్యవసాయశాఖ మంత్రి ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనే లేక రైతుల బారులు, నిరసనలు నిత్యకృత్యమయ్యాయి.
- ఆర్సీహెచ్ 369 విత్తనాల కొరత
- స్టాక్ లేదంటున్న వ్యాపారులు
- ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా
Telangana | ఆదిలాబాద్, మే 30(నమస్తే తెలంగాణ): విత్తనాల కొరతే లేదని ఓ వైపు ప్రభుత్వం చెప్తున్నా, రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు దొరక్క అన్నదాతలకు అగచాట్లు తప్పడం లేదు. సరిపడా విత్తనాలు ఉన్నాయంటున్న వ్యవసాయశాఖ మంత్రి ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనే లేక రైతుల బారులు, నిరసనలు నిత్యకృత్యమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం గురువారం ఏకంగా రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఆర్సీహెచ్ 659 పత్తి విత్తనాలు లేవని వ్యాపారులు చెప్పడంతో రైతులు స్థానిక పంజాబ్ చౌరస్తాలో రోడ్డుపై 45 నిమిషాలపాటు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రెండురోజులుగా ఒక్కొక్క రైతుకు కేవలం రెండు ప్యాకెట్లతో పోలీసుల బందోబస్తు నడుమ వ్యాపారులు సరిపెడుతున్నారు. విత్తనాలు అందక ఎందరో రైతులు వెనుదిరిగి వెళ్లారు. గురువారం ఉదయం 8 గంటలకే రైతులు భారీ సంఖ్యలో విత్తన దుకాణాలకు చేరుకోగా నిరాశే ఎదురైంది. రైతులకు అవసరమైన ఆర్సీహెచ్ 659 విత్తనాలే లేవంటూ వ్యాపారులు చెతులెత్తేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. అవసరమైన విత్తనాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య, డీఎస్పీ జీవన్‌రెడ్డి అక్కడికి వచ్చి రైతులకు విత్తనాలు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పగా, రైతులు ధర్నా విరమించారు.
విత్తనాల వ్యాన్‌ను అడ్డుకున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ విత్తన దుకాణం నుంచి వ్యాన్‌లో పత్తి విత్తనాలను తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. వ్యాపారులు ఆర్సీహెచ్ 659 విత్తనాలను తమకు విక్రయించకుండా ఇతర ప్రాంతాల్లోని దుకాణాలకు ఎందుకు తరలిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక్కడే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్‌కు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఇచ్చోడలోని డీలర్‌కు ఈ విత్తనాలు సరఫరా అవుతున్నట్టు అధికారులు గుర్తించారు.
అదే చెప్పుల వరుస
మొయినాబాద్, మే30: పదేండ్ల క్రితం విత్తనాల కోసం అన్నదాతలు పడిన కష్టాలు మళ్లీ ఊరూరా కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో బుధవారం కొంతమందికే విత్తనాలు దొరికాయి. మిగతా వారిని గురువారం రమ్మనడంతో పీఏసీఎస్ ఆఫీసు ఎదుట బారులుతీరారు. ఉదయం 7 గంటల నుంచి చెప్పుల వరుస పెట్టి రైతులు ఎదురుచూశారు. తీరా 9 గంటలకు వ్యవసాయాధికారులు వచ్చి జనుములు లేవు కేవలం జీలుగ విత్తనాలే ఇస్తామనడంతో అవసరం ఉన్న వారు తీసుకొని వెళ్లారు. రెండు రోజుల్లో జనుము విత్తనాలు రావొచ్చని మండల వ్యవసాయాధికారి తెలిపారు.
పదేండ్లలో ఇంత అధ్వానం చూడలేదు
నాకు ఎనిమిదెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. వానకాలంలో పత్తి సాగు చేస్తా. పత్తి విత్తనాల కోసం నాలుగు రోజులుగా ఆదిలాబాద్‌కు వచ్చిపోతున్నా. ఉమ్మడి రాష్ట్రంలో విత్తనాల కోసం ఇబ్బందులు పడ్డాం. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రభుత్వంలో విత్తనాల పంపిణీ సక్రమంగా జరిగింది. ఈ పదేండ్లలో ఇంత అధ్వానం చూడలేదు. ఇప్పుడు మళ్లీ గోస పడాల్సి వస్తున్నది. అవసరమైన కంపెనీల విత్తనాలు దుకాణాల్లో దొరుకుతలేవు. శనివార విత్తనాలు వస్తాయని అధికారులు అంటున్నారు.
– పొచ్చన్న, రైతు, కుచులాపూర్, తలమడుగు మండలం, ఆదిలాబాద్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

