UK NRIs on CM KCR | కేసీఆర్ జాతీయ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. యూకే ఎన్నారైలు
UK NRIs on CM KCR | జాతీయ పార్టీ స్థాపించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు యునైటెడ్ కింగ్డమ్ ఎన్నారైలు తెలిపారు.
UK NRIs on CM KCR | తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని యునైటెడ్ కింగ్డమ్ ఎన్నారైలు ఆకాంక్షించారు. నూతన జాతీయ పార్టీ స్థాపించాలన్న ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై చారిత్రక లండన్ టవర్ బ్రిడ్జి వద్ద ఎన్నారైలు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు.

యునైటెడ్ కింగ్డమ్ (బ్రిటన్)లో నివసిస్తున్న వివిధ రాష్ట్రాల ఎన్నారైలు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియా శీలక పాత్ర పోషించాలని కోరారు. భారతదేశానికి నాయకత్వం వహించి దేశ గతిని మార్చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశమంతా ఈనాడు తెలంగాణ మోడల్ వైపు చూస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధి దేశవ్యాప్తం కావాలంటే సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం అని ఎన్నారైలు చెప్పారు.

ఈ సందర్భంగా `దేశ్‌కీ నేత కేసీఆర్` అంటూ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ భారీ కటౌట్ ఈ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలంతోపాటు పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

