తెలంగాణలో భారీగా తగ్గిన నిరుద్యోగ రేటు
దేశంలో అనేక రాష్ర్టాలను నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తుంటే, తెలంగాణలో మాత్రం అతి తక్కువ నిరుద్యోగిత రేటు నమోదయ్యింది. జాతీయ సగటుకన్నా అతి తక్కువ రేటును మన రాష్ట్రం నమోదుచేసింది. గత నెలలో రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 0.7 శాతంగా ఉన్నది. అదే సమయంలో జాతీయ నిరుద్యోగిత రేటు 6.57 శాతంగా నమోదయ్యింది.
- జనవరిలో రాష్ట్రంలో రేటు 0.7 శాతమే
- జాతీయ నిరుద్యోగిత రేటు 6.57 శాతం
- 26 రాష్ర్టాలకన్నా మన వద్దే అతి తక్కువ
- ఉద్యోగ కల్పన, ఉపాధి రంగాల్లో టాప్
- బీజేపీ పాలిత హర్యానాలో భారీ నిరుద్యోగిత
- వివరాలు వెల్లడించిన సీఎంఐఈ సంస్థ
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): దేశంలో అనేక రాష్ర్టాలను నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తుంటే, తెలంగాణలో మాత్రం అతి తక్కువ నిరుద్యోగిత రేటు నమోదయ్యింది. జాతీయ సగటుకన్నా అతి తక్కువ రేటును మన రాష్ట్రం నమోదుచేసింది. గత నెలలో రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 0.7 శాతంగా ఉన్నది. అదే సమయంలో జాతీయ నిరుద్యోగిత రేటు 6.57 శాతంగా నమోదయ్యింది. బీజేపీ పాలిత హర్యానాలో అత్యధికంగా 23.4 శాతం ఉండగా, రాజస్థాన్ 18.9 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. 2022 జనవరికి సంబంధించిన నిరుద్యోగిత రేటు నివేదికను సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఇటీవల విడుదల చేసింది.
కరోనా వెంటాడుతున్నా..
ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక చర్యలతో రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు వేగంగా తగ్గుతున్నది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతుండటంతో అందరికీ పని దొరుకుతున్నది. 2020 మే నెలలో రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 14.7 శాతం ఉన్నది. అప్పుడే కరోనా దేశంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత మూడు దశల్లో కరోనా వెంటాడినా రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు క్రమంగా తగ్గటం విశేషం. రెండేండ్లలోనే నిరుద్యోగిత రేటు ఒకశాతం కన్నా తక్కువకు పడిపోయింది. రాష్ట్రంలోకి ఉత్పాదక, నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. దీంతో ఉపాధి కల్పనలో రాష్ట్రం పురోగతి సాధిస్తున్నట్టు నిపుణలు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్పై దాడి..!
రెడ్ డ్రెస్లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్లో అదరగొట్టిన భామ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

