JPS | భర్త వేధింపులు భరించలేక జేపీఎస్ ఆత్మహత్య.. సమ్మె కారణంగానే ఆత్మహత్య అంటూ తప్పుడు ప్రచారం
భర్త వేధింపులు భరించలేక జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రంగాపురంలో శుక్రవారం జరిగింది.
JPS | ఖానాపురం, మే 12: భర్త వేధింపులు భరించలేక జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రంగాపురంలో శుక్రవారం జరిగింది. అయితే ఈమె మృతిని రాజకీయం చేసేందుకు సమ్మెలో ఉన్న పలువురు జేపీఎస్‌లు ప్రయత్నించారు. నర్సంపేట ఏసీపీ సంపత్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌లోని రంగశాయిపేటకు చెందిన రంగు ప్రసాద్, సోని దంపతులు. వీరికి 8 ఏండ్ల కూతురు శ్లోక ఉన్నది. సోని నాలుగేండ్ల క్రితం ఖానాపురం మండలం రంగాపురం గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగంలో చేరింది. సోని ఉద్యోగంలో చేరిన నాటి నుంచి భర్త ఆమెపై అనుమానం పెంచుకొని తరచూ వేధిస్తూ చిత్రహింసలకు గురిచేసేవాడు. ఉద్యోగం మానేయాలి, లేకపోతే పనిచేసే గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే చనిపోవాలని పదే పదే వేధించేవాడు.
ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తే తన భర్త ఉద్యోగం మానేయాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తోటి ఉద్యోగులతోనూ పలుమార్లు చెప్పుకొని బాధపడుతుండేది. ఆరేండ్లపాటు వీరు నర్సంపేటలోనే ఉండేవారు. కానీ ఆరు నెలల క్రితం ప్రసాద్ తన స్వస్థలం రంగశాయిపేటకు వెళ్లాడు. అప్పటి నుంచి సోని తన తల్లిగారింట్లోనే ఉంటూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. శుక్రవారం మధ్యాహ్నం జీపీకి వెళ్లిన ఆమె.. బీరువాలో ఉన్న గడ్డిమందును తీసుకుని తాగింది.
వెంటనే రాగంపేట జీపీ కార్యదర్శికి ఫోన్‌చేసి తాను పురుగులమందు తాగినట్టు చెప్పి, స్కూటీపై ఖానాపురం వైపు బయలుదేరి కొత్తూరు శివారులో పడిపోయింది. అప్పటికే రంగాపురం వైపు వెళ్లిన రాగంపేట కార్యదర్శి పడిపోయిన సోనిని నర్సంపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో సోని మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దవాఖానకు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
సోని మృతిపై రాజకీయం
భర్త వేధింపులు తాళలేక జేపీఎస్ సోని ఆత్మహత్య చేసుకుంటే.. సమ్మెలో పాల్గొంటున్న పలువురు జేపీఎస్‌లు ఈ ఘటనను రాజకీయం చేయడాన్ని తప్పుబడుతున్నారు. కుటుంబ కలహాలతోనే ఆమె మృతి చెందినట్టు స్పష్టమైనా పలువురు ఆందోళనకు దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమ్మెకు, సోని మృతికి సంబంధం లేదు
నర్సంపేటకు చెందిన సోని ఉద్యోగంలో చేరి నాలుగు సంవత్సరాలైంది. మొదట జేపీఎస్ సమ్మెలో పాల్గొంది. జేపీఎస్‌లు అందరూ విధుల్లో చేరాలని ప్రభుత్వం నోటీసు ఇవ్వడానికి ముందే ఈ నెల 6న ఆమె స్వచ్ఛందంగా విధుల్లో చేరింది. ఆమె ఆత్మహత్యకు జేపీఎస్‌ల సమ్మెకు ఎలాంటి సంబంధం లేదు. కల్పన, డీపీవో, వరంగల్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

