TS Weather Alert | హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడటంతో రాష్ట్రంలో మూడు రోజులు పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
26 వరకు పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, భారీ వర్షాలు లేవని స్పష్టం చేసింది. హైదరాబాద్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం పొగమంచు కమ్మేస్తుందని చెప్పింది. ఉపరితల ఆవర్తనంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది.