డెంగీతో ఇద్దరు చిన్నారుల మృతి
డెంగీ జ్వరంతో జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం కొత్తపల్లికి చెందిన జోగు శంకర్, సంధ్య దంపతులకు 20 నెలల కూతురు జోగు సాత్విక ఉన్నది.
- జనగామ, మానుకోటలో విషాదం
స్టేషన్‌ఘన్‌పూర్/తొర్రూరు, ఆగస్టు 21 : డెంగీ జ్వరంతో జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం కొత్తపల్లికి చెందిన జోగు శంకర్, సంధ్య దంపతులకు 20 నెలల కూతురు జోగు సాత్విక ఉన్నది. రాఖీ పౌర్ణమికి ముందు రోజు సాత్వికకు జ్వరం రావడం తో స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చూపించగా, టైఫాయిడ్ ఉన్నట్టు తేలింది. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
రక్త పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాపకు డెంగీ సోకిందని, లివర్ దెబ్బతిన్నట్టు తెలిపారు. సాత్విక చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. అలాగే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన ధర్మారపు బుచ్చిమల్లు, కవిత దం పతుల చిన్న కూతురు ధర్మారపు సాత్విక (9) కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నది. పలు దవాఖానల్లో వైద్యం చే యించారు. తగ్గకపోవడంతో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

