Telangana | బాలిక మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. ఫ్రీ బస్సుల్లో తిరుగుతూ పోలీసులకు ఇలా దొరికింది!
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలిక అదృశ్యమైన కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. పెద్దపల్లి నుంచి కరీంనగర్‌కు రావాల్సిన మైనర్ బాలిక ఈ నెల 27న బొమ్మకల్ ఫ్లై ఓవర్ వద్ద బస్సు దిగి కనిపించకుండా పోయింది.
Telangana | రాంనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలిక అదృశ్యమైన కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. పెద్దపల్లి నుంచి కరీంనగర్‌కు రావాల్సిన మైనర్ బాలిక ఈ నెల 27న బొమ్మకల్ ఫ్లై ఓవర్ వద్ద బస్సు దిగి కనిపించకుండా పోయింది. ఈ ఘటనపై బాలిక తండ్రి నరసింహం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కరీంనగర్ రూరల్ పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక గురువారం రాత్రి సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్‌లో దొరకడంతో కరీంనగర్‌కు తీసుకువచ్చిన రూరల్ పోలీసులు వైద్యం కోసం దవాఖానలో చేర్పించారు ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్ ఏసీపీ కర్ణాకర్‌రావు మీడియాకు వివరాలు వెల్లడించారు.
సెలవులు రావడంతో సదరు బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో హాస్టల్‌కు వెళ్లడం ఇష్టం లేక ఫ్లైఓవర్ వద్ద దిగి వేరే బస్సు ఎక్కి హైదరాబాద్ వెళ్లింది. అయితే, అదే రోజు బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టగా సీసీ ఫుటేజీల ద్వారా హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్‌లో తిరిగినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఆ కోణంలో విచారించగా ఇంటికి వెళ్లేందుకు భయపడిన బాలిక.. ఫ్రీ బస్సు సౌకర్యం ఉండటంతో జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్ బస్సుల్లో తిరుగుతూ చివరకు గురువారం రాత్రి మళ్లీ జూబ్లీ బస్టాండ్‌కు చేరుకుంది. అప్పటికే ఆర్టీసీ బస్టాండ్ సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు జూబ్లీ బస్టాండ్‌లో నిఘా వేయడంతో అక్కడకు వచ్చిన బాలికను చేరదీశారు. 36 గంటల్లోనే కేసు ఛేదించి బాలికను క్షేమంగా తీసుకువచ్చిన రూరల్ సీఐ ప్రదీప్, ఎస్ఐ వెంకటరాజం, సిబ్బంది దయానంద్, అంజయ్య, తిరుపతి, రాజేందర్‌ను ఏసీపీ అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Free bus
- Girl Missing
- JBS
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

