Tula Uma | బీజేపీకి తుల ఉమ రాజీనామా.. వేములవాడ టికెట్ ఇచ్చి వెనక్కి తీసుకోవడంపై మనస్థాపం
Tula Uma | భారతీయ జనతాపార్టీకి తుల ఉమ రాజీనామా చేశారు. వేములవాడ అసెంబ్లీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కి తీసుకోవడంపై ఆమె మనస్థాపం చెందారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు.
హైదరాబాద్: భారతీయ జనతాపార్టీకి తుల ఉమ రాజీనామా చేశారు. వేములవాడ అసెంబ్లీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కి తీసుకోవడంపై ఆమె మనస్థాపం చెందారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. బీజేపీలో చేరినప్పటి నుంచి పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తనవంతు కృషి చేశానని, పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా తనకు వేములవాడ అసెంబ్లీ టికెట్ ఇచ్చారని, అయితే ఆఖరి నిమిషంలో వేరేవాళ్లకి బీఫామ్ ఇచ్చి తనను అవమానించారిన తుల ఉమ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
దీన్ని తన ఒక్కదానికి జరిగిన అవమానం కాదని, తన గొల్ల కురుమ జాతికి జరిగిన అవమానంగా భావిస్తున్నానని ఉమ తెలిపింది. బీసీ నాయకురాలికి టికెట్ ప్రకటించి బీఫామ్ ఇవ్వని మీరు.. బీసీ నినాదంతో ముందుకు పోతామనం విడ్డూరంగా ఉందని లేఖలో ఎద్దేవా చేశారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే మీరు బీసీ మహిళనైన తనను అవమానించడం బాధి కలిగించిందని పేర్కొన్నారు. కాగా, తన వెంట నడిచే ప్రజలు, కార్యకర్తలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని తుల ఉమ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

