TTD | తిరుమల శ్రీవారి ఆర్జితసేవ, అంగప్రదక్షిణ టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రత్యేక, సర్వదర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక నెల ముందుగా విడుదల చేస్తుంది. ఇక ఆర్జిత, అంగ ప్రదక్షిణ టికెట్ల రెండు నెలల ముందుగానే ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నది.
హైదరాబాద్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రత్యేక, సర్వదర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక నెల ముందుగా విడుదల చేస్తుంది. ఇక ఆర్జిత, అంగ ప్రదక్షిణ టికెట్ల రెండు నెలల ముందుగానే ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నది. ఇందులో భాగంగా జూన్ నెల కోటకు సంబంధించి ఆర్జిత సేవల టికెట్లను శుక్రవారం విడుదల చేయనుంది. ఉదయం 11 గంటల నుంచి ఈ నెల 26 ఉదయం 11 గంటల వరకు ఆన్లైన్ డిప్లో పాల్గొనేందుకు భక్తులు తమ పేర్లను నమోదుచేసుకోచ్చు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లు అందుబాటులో ఉంటాయి. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు రుసుం చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
అదేవిధంగా జూన్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్లను ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది. వీటితోపాటు ఏప్రిల్ నెలకు సంబంధించిన వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత దర్శన కోటా టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

