TSRTC | బస్ టికెట్‌తో పాటే ప్రయాణికులకు స్నాక్ బాక్స్.. 27 నుంచి e-గరుడ బస్సుల్లో అమలు
TSRTC | హైదరాబాద్ : సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్‌టికెట్‌తో పాటే ‘స్నాక్‌బాక్స్'ను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో వాటర్ బాటిల్ అందిస్తున్న సంస్థ.. తాజాగా స్నాక్‌బాక్స్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
TSRTC | హైదరాబాద్ : సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్‌టికెట్‌తో పాటే ‘స్నాక్‌బాక్స్’ను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో వాటర్ బాటిల్ అందిస్తున్న సంస్థ.. తాజాగా స్నాక్‌బాక్స్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ – విజయవాడ మార్గంలో తిరిగే e-గరుడ బస్సుల్లో స్నాక్‌బాక్స్ విధానాన్ని శనివారం నుంచి ప్రారంభిస్తోంది. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను ఆధారంగా మిగతా సర్వీసులకు ఈ విధానాన్ని విస్తరించనుంది.
ఈ స్నాక్‌బాక్స్‌లో చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చికి ప్యాకెట్లతో పాటు మౌత్ టిష్యూ పేపర్ ఉంటాయి. స్నాక్‌బాక్స్ కోసం టికెట్ రేటులోనే రూ.30 నామమాత్రపు ధరను టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
ప్రజలకు మరింతగా చేరువయ్యేందుకు వినూత్న కార్యక్రమాలతో టీఎస్ఆర్టీసీ ముందుకు వెళుతోందని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. అందులో భాగంగా ప్రయాణికులకు స్నాక్‌బాక్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు వారు చెప్పారు.
2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని, ఈ నేపథ్యంలోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించడంతో పాటు రోగనిరోధక శక్తిని బలపరిచే చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చికి ప్యాకెట్లతో పాటు ప్రయాణంలో ఉపయోగపడే మౌత్ టిష్యూపేపర్తో కూడిన స్నాక్‌బాక్స్‌ను ప్రయాణికులకు సంస్థ అందించనుందని చెప్పారు. టీఎస్ఆర్టీసీ ఏ కార్యక్రమం తీసుకువచ్చినా ప్రయాణికులు బాగా ఆదరిస్తున్నారని, సంస్థను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ స్నాక్‌బాక్స్ విధాన్ని అలాగే ఆదరించాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనార్ కోరారు.
ప్రతి స్నాక్‌బాక్స్‌లో క్యూఆర్ కోడ్ ఉంటుందని, దానిని ఫోన్లలో స్కాన్ చేసి విలువైన సలహాలు,సూచనలు ఇవ్వాలని వారు ప్రయాణికులకు సూచించారు. ఈ ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకొని స్నాక్‌బాక్స్‌లో మార్పులు, చేర్పులు చేస్తామని తెలిపారు. ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే మిగితా సర్వీసులకు స్నాక్‌బాక్స్ విధానాన్ని విస్తరిస్తామని ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌లు స్పష్టం చేశారు.
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్ టికెట్ తో పాటే ‘స్నాక్ బాక్స్’ను ఇవ్వాలని #TSRTC సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో వాటర్ బాటిల్‌ను ఇస్తున్న సంస్థ.. తాజాగా స్నాక్ బాక్స్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్-విజయవాడ… pic.twitter.com/d2Yp5c3I7e
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) May 26, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

