హైదరాబాద్: పిల్లలకు టీఎస్ ఆర్టీసీ (TS RTC) నూతన సంవత్సర కానుక అందిస్తున్నది. కొత్త ఏడాది తొలిరోజున 12 ఏండ్లలోపు చిన్నారులు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించింది. సంస్థ అందిస్తున్న అన్ని రకాల సర్వీసుల్లో ఇది వర్తిస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. అయితే పిల్లలతోపాటు తల్లిదండ్రుల్లో ఒకరు విధిగా ఉండాలని చెప్పారు.
కాగా.. ఈ ఏడాది బాలల దినోత్సవం సందర్భంగా కూడా 15 ఏండ్లలోపు చిన్నారులకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలు కల్పించిన విషయం తెలిసిందే.