TSRTC | మహిళలకు ఉచిత ప్రయాణం.. జేబీఎస్లో ఆర్టీసీ ఎండీ పరిశీలన
TSRTC | హైదరాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్‌ను సోమవారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలు తీరుపై ఆయన క్షేత్ర పరిశీలన చేశారు.
TSRTC | హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్‌ను సోమవారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలు తీరుపై ఆయన క్షేత్ర పరిశీలన చేశారు.
జేబీఎస్-ప్రజ్ఞాపూర్, జేబీఎస్-జనగామకు వెళ్లే పల్లె వెలుగు బస్సుల్లో, బాన్సువాడకు వెళ్లే ఎక్స్ ప్రెస్ బస్సులో ఉన్న మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ సౌకర్యం అమలవుతున్న తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జేబీఎస్-వెంకట్ రెడ్డి నగర్(రూట్ నంబర్ 18 వీ/జే) సిటీ ఆర్డినరీ బస్సులో మెట్టుగూడ వరకు ప్రయాణించారు. అందులో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్‌ను అందజేశారు.
అనంతరం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన వస్తోందన్నారు. మహిళల ప్రయాణ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని.. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ గొప్ప కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీని భాగస్వామిగా చేసినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఆధార్ కార్డులను చూపించాలి..
మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఉచిత బస్ ప్రయాణ స్కీమ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసి.. వాటిపై 40 వేల మంది సిబ్బందికి అవగాహన కల్పించామని గుర్తు చేశారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ స్థానికతను నిర్థారించుకునేందుకు తమ ఆధార్ కార్డులను సిబ్బందికి చూపించి.. సంస్థకు సహకరించాలని కోరారు.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు..
ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రవేశపెట్టగానే రద్దీ పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సులను నడిపేందుకు ప్లాన్ రూపొందించామని చెప్పారు. రద్దీ సమయాల్లో ప్రయాణికులు కొంత సమయనం పాటించి.. సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఎక్కడైనా చిన్నపాటి పొరపాట్లు జరిగితే ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావాలని, 24 గంటలు అందుబాటులో ఉండే సంస్థ కాల్ సెంటర్ నంబర్లైనా 040-69440000, 040-23450033 ఫోన్ చేసి చెప్పొచ్చన్నారు. వాటిని వెంటనే సరిదిద్దుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (గ్రేటర్ హైదరాబాద్ జోన్) వెంకటేశ్వర్లు, రంగారెడ్డి, సికింద్రాబాద్ ఆర్ఎంలు శ్రీధర్, ఖుష్రోషా ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- JBS
- mahalakshmi
- RTC Buses
- TSRTC
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

