RTC MD | శ్రీరామ నవమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ MD సజ్జనార్ శుభవార్త..!
RTC MD | శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలియజేశారు. భద్రాచలంలో ఇవాళ జరిగే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను రాష్ట్రంలోని భక్తులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని TSRTC యాజమాన్యం నిర్ణయించిందని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
RTC MD : శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలియజేశారు. భద్రాచలంలో ఇవాళ జరిగే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను రాష్ట్రంలోని భక్తులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని TSRTC యాజమాన్యం నిర్ణయించిందని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టిందని సజ్జనార్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలను కోరుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
అదేవిధంగా టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగ వెబ్సైట్ https://tsrtclogistics.in ను సందర్శించి కూడా తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని సజ్జనార్ సూచించారు. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం పవిత్ర తలంబ్రాలను కోరుకున్న భక్తులకు టీఎస్ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుందని తెలిపారు.
శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో ఇవాళ జరిగే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు… pic.twitter.com/T1PLlFaK6L
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) April 17, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

