ఆర్టీసీ కార్గో ఆదాయం 120.52 కోట్లు
టీఎస్ ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవల ద్వారా రెండేండ్లలో ఆర్టీసీకి రూ.120.52 కోట్ల ఆదాయం వచ్చిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. కార్గో పార్సిల్ సేవలు అద్భుతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కార్గో సేవలు ప్రారంభించి ఆదివారంతో రెండేండ్లు పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో
కార్గో సేవలకు రెండు వసంతాలు పూర్తి
అవసరాలకు అనుగుణంగా సేవల విస్తరణ
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవల ద్వారా రెండేండ్లలో ఆర్టీసీకి రూ.120.52 కోట్ల ఆదాయం వచ్చిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. కార్గో పార్సిల్ సేవలు అద్భుతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కార్గో సేవలు ప్రారంభించి ఆదివారంతో రెండేండ్లు పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పార్సిళ్ల బట్వాడా ద్వారా రూ.88.68 కోట్లు, కార్గో రవాణాతో రూ.31.84 కోట్లు సమకూరినట్టు పేర్కొన్నారు.
నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని కరోనా మహమ్మారి ఆర్థికంగా మరింత దెబ్బతీసిందని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ సూచనల మేరకు సంస్థ ఆదాయం పెంచుకునేందుకు పార్సిల్, కొరియర్, కార్గో సేవలను 2020 జూన్ 19న ప్రారంభించినట్టు మంత్రి చెప్పారు. వినియోగదారుల నుంచి కూడా మంచి స్పందన వస్తున్నదని తెలిపారు. ఇంటింటికీ సైతం సేవలను ప్రారంభించామని, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ కార్గో సేవలను ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల్లోని నగరాలకూ విస్తరించామని పేర్కొన్నారు. కార్గో సేవలను వాడుకుంటున్న వినియోగదారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
AP News | ఏపీలోని 8 మున్సిపాలిటీల్లో నిలిచిన ఎన్నికల ప్రక్రియ..!
Saurav Das | సౌరవ్ దాస్, రాంకాలకు అదనపు జుడీషియల్ కస్టడీ కోరిన పోలీసులు.. ఆర్డర్ రిజర్వ్ చేసిన కోర్ట్
DGP CV Anand | అమరుల త్యాగాలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు.. నిజాయితీగా సేవ చేయడమే వారికి నిజమైన నివాళి: డీజీపీ సీవీ ఆనంద్
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

