హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలో ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వన్ టైం రిజిస్ర్టేషన్ (ఓటీఆర్) ఎడిట్‌ను సులభతరం చేసింది. ఐడీ మర్చిపోయినా, అప్పటి ఫోన్ నంబర్ ప్రస్తుతం వాడుకలో లేకపోయినా తమను సంప్రదిస్తే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించింది.
హెల్ప్‌డెస్క్ నంబర్ 040–22445566 ను సంప్రదిస్తే వివరాలు తెలుపనున్నట్టు ప్రకటించింది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించాలని సూచించింది. లేదా helpdesk@tspsc.gov.in ఈ–మెయిల్‌కు వివరాలు పంపించినా సమస్యకు పరిష్కారం చూపుతామని వెల్లడించింది. అభ్యర్థులు నేరుగా నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ ఆఫీసుకు వెళ్లి లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకొన్నా అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపింది.
వన్ టైం రిజిస్ర్టేషన్‌లో జాగ్రత్త అభ్యర్థులు వన్ టైం రిజిస్ర్టేషన్ (ఓటీఆర్) జాగ్రత్తగా చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. వివరాల నమోదు సమయంలో పొరపాట్లు జరిగితే ఉద్యోగ ్రపకటన దరఖాస్తులోనూ అవే పునరావృతం అవుతాయని హెచ్చరించింది. దరఖాస్తు పూర్తిచేసిన తరువాత ్రపివ్యూ కోసం 3 నిమిషాల సమయం ఉంటుందని, ఆలోపు మరోసారి పరిశీలించి పొరపాట్లు ఉంటే సరిచేసుకోవాలని వివరించింది. రిజిస్ర్టేషన్, ఎడిట్ సమయంలో ఏమైనా సందేహాలుంటే హెల్ప్‌డెస్క్‌కు కాల్ చేస్తే వెంటనే పరిష్కారం లభిస్తుందని సూచించింది.