హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ మరో మూడు పరీక్షల తేదీలను ప్రకటించింది. 15, 16న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, ఏప్రిల్ 4న హార్టికల్చర్ ఆఫీసర్, ఏప్రిల్ 23న అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించనున్నది. ఈ మూడు పరీక్షలు ఆన్లైన్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో జ రుగుతాయని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ వెల్లడించారు. 185 వెటర్నరీ సర్జన్ పోస్టులు, 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు, 113 అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.