పలు ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను ప్రకటించిన టీఎస్పీఎస్సీ
TSPSC | పలు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం ప్రకటించింది. వ్యవసాయ అధికారి నియామక పరీక్ష ఏప్రిల్ 25న నిర్వహించనున్నట్లు పేర్కొంది.
TSPSC | పలు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం ప్రకటించింది. వ్యవసాయ అధికారి నియామక పరీక్ష ఏప్రిల్ 25న నిర్వహించనున్నట్లు పేర్కొంది. డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్కు సంబంధించిన పరీక్షను మే 7న, పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామక పరీక్ష మే 13న, ఇంటర్ సాంకేతిక విద్యాశాఖలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి 17న, ఇంటర్ కమిషనరేట్‌లో లైబ్రేరియన్ల పోస్టుల భర్తీకి 17న నిర్వహించనున్నట్లు చెప్పింది. అయితే, పరీక్షలన్నీ ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
18 డ్రగ్స్ ఇన్స్పెక్టర్ల నియామకానికి గత డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విధితమే. దాంతో పాటు 247 లెక్చరర్ల పోస్టులకు, సాంకేతిక విద్యలో ఫిజికల్ డైరెక్టర్ 37, ఇంటర్మీడియట్ విద్యలో ఫిజికల్ డైరెక్టర్ 91 పోస్టులు, ఇంటర్ కమిషనరేట్‌లో 40 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి గత నెలలో వేర్వేరుగా టీఎస్పీఎస్పీ నోటిఫికేషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు దరఖాస్తులను స్వీకరించింది. ఇప్పటికే దరఖాస్తు గడువు ముగిసింది. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

