కొలువుల బొనాంజా.. 9,168 గ్రూప్-4 పోస్టులకు నోటిఫికేషన్
ఉద్యోగ ఖాళీల భర్తీని శరవేగంగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఏడాది ముంగిట మరో శుభవార్తను ప్రకటించింది.
- ఉద్యోగార్థులకు న్యూ ఇయర్ గిఫ్ట్
- రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. 25 శాఖల్లో పోస్టుల భర్తీ
- ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు
- వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో రాత పరీక్ష
- ఆర్థిక శాఖ అనుమతిచ్చిన వారంలోనే నోటిఫికేషన్
- ఇక వరుస నోటిఫికేషన్లు… టీఎస్పీఎస్సీ కసరత్తు
ఉద్యోగ ఖాళీల భర్తీని శరవేగంగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఏడాది ముంగిట మరో శుభవార్తను ప్రకటించింది. అన్ని ప్రభుత్వ శాఖల్లోని దాదాపు 80,039 ఖాళీలను భర్తీ చేయనున్నామని సీఎం కేసీఆర్ గత శాసనసభలో ప్రకటించగా.. ఒక్కో శాఖ వారీగా ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు జారీచేస్తున్నది.
హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఉద్యోగార్థులకు రాష్ట్రప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కొత్త సంవత్సరం ముంగిట కొలువుల బొనాంజాను ప్రకటించింది. ఇప్పటికే గ్రూప్-1 ద్వారా 503 పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించిన టీఎస్పీఎస్సీ.. గురువారం గ్రూప్-4 నోటిఫికేషన్ జారీ చేసింది. తద్వారా 25 శాఖల్లో ఏకంగా 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 23వ తేదీ నుంచి జనవరి 12 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్టు వెల్లడించింది.
గ్రూప్-4 రాతపరీక్షను వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహించనున్నట్టు తెలిపింది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపర్చనున్నట్టు పేర్కొన్నది. గ్రూప్-4 నోటిఫికేషన్ ద్వారా ప్రతి శాఖలో కిందిస్థాయి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం 9,168 పోస్టుల్లో అత్యధికంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో 2,701 పోస్టులను భర్తీ చేయనున్నది. రెవెన్యూ శాఖలో 2,077, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 1,245 పోస్టులు, ఉన్నతవిద్యలో 742 పోస్టులను నింపనున్నారు.
ఆర్థికశాఖ అనుమతిచ్చిన ఆరో రోజునే..
ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిక్కచ్చిగా ఉందో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదలను బట్టి అర్థమవుతున్నది. గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థికశాఖ అనుమతినిచ్చిన వారం రోజుల్లోనే నోటిఫికేషన్ జారీ కావడం గమనార్హం. ఈ నెల 25న 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. దీంతో వెంటనే కసరత్తు ప్రారంభించిన టీఎస్పీఎస్సీ సరిగ్గా ఆరో రోజున నోటిఫికేషన్‌ను విడుదల చేసి దూకుడును ప్రదర్శించింది.
ఇక వరుస నోటిఫికేషన్లు…
వరుసగా నోటిఫికేషన్ల విడుదలకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో 61,804 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతించింది. ఈ నేపథ్యంలోనే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసి 503 పోస్టులకు రాతపరీక్ష నిర్వహించిన టీఎస్పీఎస్సీ.. తాజాగా 9,168 పోస్టులతో గ్రూప్-4 నోటిఫికేషన్ జారీ చేసింది. త్వరలో 726 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్, 1373 పోస్టులతో గ్రూప్-3 నోటిఫికేషన్ రానున్నాయి.
శాఖల వారీగా గ్రూప్-4 పోస్టుల వివరాలు
శాఖ : పోస్టుల సంఖ్య
వ్యవసాయ, కో-ఆపరేషన్ శాఖ : 44
పశుసంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ : 02
బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ : 307
ఫుడ్-సివిల్‌సప్లయ్ డిపార్ట్మెంట్ : 72
విద్యుత్తు శాఖ : 02
అటవీ, వాతావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ : 23
ఆర్థిక శాఖ : 255
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ : 05
వైద్యారోగ్య శాఖ : 338
ఉన్నత విద్యాశాఖ : 742
హోంశాఖ : 133
పరిశ్రమల శాఖ : 07
నీటిపారుదల శాఖ : 51
కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ : 128
మైనార్టీ సంక్షేమం : 191
పురపాలక, పట్టణాభివృద్ది శాఖ : 2701
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ : 1245
ప్రణాళిక శాఖ : 02
రెవెన్యూ శాఖ : 2077
ఎస్సీ డెవలప్మెంట్ శాఖ : 474
సెకండరీ ఎడ్యుకేషన్ : 97
రవాణా, రోడ్లు, భవనాల శాఖ : 20
గిరిజన సంక్షేమ శాఖ : 221
స్త్రీ, శిశు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ శాఖ : 18
యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ : 13
మొత్తం : 9,168
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

